తెలంగాణపై నిర్ణయానికి సమయం పడుతుంది: చిదంబరం

తెలంగాణలో శాంతిని కాపాడాలని ఆయన రాజకీయ పార్టీలకు, తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. ఓపిక లేకపోతే సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేమని ఆయన అన్నారు. ఆందోళనలు చేస్తూ పోతే సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. వరదల తాకిడి ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల కోసం 440 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో 9 విప్లవ గ్రూపులతో శాంతి కోసం చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. శానససభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వంద కంపెనీల కేంద్ర బలగాలను పంపుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications