హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వంపై మండిపడిన చిరంజీవి, తప్పులను చెప్తామని ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి కాల్పుల ఘటనపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము మిత్రపక్షంగా ఉంటూనే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపడానికి వెనకాడబోమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. డబ్బున్నవాళ్లకే కొమ్ముకాసే విధంగా ప్రభుత్వ విధానాలున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్పుల ఘటన అమానుషమని ఆయన అన్నారు. ప్రజల తరఫున తాము మాట్లాడుతామని ఆయన చెప్పారు.

గత రాజకీయ నాయకుల స్వార్థం వల్లే కాకరాపల్లిలో కాల్పుల ఘటన చోటుచేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాల్పుల ఘటనను ఆయన ఖండించారు. అవసరమైతే పవర్‌ప్లాంట్‌ లైసెన్సుల రద్దుకు ఆలోచించాలని ఆయన అన్నారు. కోస్తా ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితి నెలకొన్నందున ప్రజలకు బాసటగా నిలిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు. కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి, గాయపడినవారికి మూడు లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Prajarajyam president Chiranjeevi expressed anguish at Government on Kakarapalli firing incident. He demanded high level judicial enquiry on Kakarapalli incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X