వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోద్రా రైలు దగ్ధం కేసులో 11 మందికి ఉరి, 20 మందికి జీవిత ఖైదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Godhra Verdict
అహ్మదాబాద్: గోద్రా రైలు దగ్ధం కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు మంగళవారం తొమ్మిదేళ్ల తర్వాత సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 11 మందికి ఉరిశిక్ష విధిస్తూ, మరో 20 మందికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. గోద్రా రైలు దగ్ధం కేసులో కోర్టు 31 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఫిబ్రవరి 22వ తేదీన తీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు మౌల్వీ ఉమర్జీతో పాటు 63 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. గుజారత్‌లో 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం సంఘటనలో 59 మంది మరణించారు. అనంతరం చెలరేగిన అల్లర్లలో 1200 మంది దాకా చనిపోయారు.

తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గోద్రా రైలు దగ్ధం కేసులో హజీ బిల్లా, రజాక్ కుర్కుర్‌లతో పాటు ప్రధాన నిందితుడు ఉమర్జీకి కేసు నుంచి విముక్తిని ప్రసాదించింది. గోద్రా రైలు దగ్ధం కేసులో మొత్తం 94 మందిపై నేరారోపణ చేస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 2009 జూన్‌లో సబర్మతి జైలు ఆవరణలో ప్రారంభమైంది. గోద్రా రైలు ఆరో కోచ్‌ను దగ్ధం చేయడంలో క్రిమినల్ కుట్రకు పాల్పడి, 59 మంది మరణానికి కారణమయ్యారంటూ వారిపై నేరారోపణ చేశారు.

English summary
A special court on Tuesday pronounced the death penalty for 11 convicted in the Godhra train burning case. 20 others have been awarded the life sentence. Thirty-one people were on February 22 convicted and 63 others, including the main accused Maulvi Umarji, were acquitted by a special court here in the 2002 Godhra train burning incident that left 59 people dead and triggered violence in Gujarat that had claimed the lives of over 1200 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X