తెలంగాణపై సోనియా చెప్తే 24 గంటల్లోగా బాబు చెప్తారు: దేవినేని ఉమ

తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమ అభిప్రాయానికి భిన్నంగా నిర్ణయం తీసుకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతామని ఆయన హెచ్చరించారు. తమను వలసవాదులుగా, దోపిడీదారులుగా అభివర్ణించడాన్ని ఆయన తప్పు పట్టారు. కొడితే వెళ్లిపోతారని ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తమపై తెలంగాణవాదులు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యవాద ఉద్యమం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 3వ తేదీన తమ పార్టీకి చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమవుతారని ఆనయ చెప్పారు. సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్ర తెలుగుదేశం శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలుగుదేశం శాసనసభ్యుడు పుల్లారావు కూడా పాల్గొన్నారు.