వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

By Pratap
|
Google Oneindia TeluguNews

SY Qureshi
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల శాసనసభలకు ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిల్లో రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. ఈ మూడు రాష్టాల అసెంబ్లీలకు ఏప్రిల్ 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు దశల్లో పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ఏప్రిల్ 18వ తేదీ ప్రారంభమై మే 10వ తేదీన పూర్తవుతుంది. అసోం శాసనసభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 4, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా మే 13వ తేదీన విడుదలవుతాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి సారి ప్రవాస భారతీయులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి, కడప పార్లమెంటు సీటుకు రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

English summary
The Election Commission has announced the dates for elections in five states. While Tamil Nadu votes on April 13, Kerala votes on April 13. West Bengal votes on six days, starting April 18; Assam votes on April 4 and April 11; Puducherry votes on April 13. Counting for all states will take place on May 13.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X