చంద్రబాబుతో జెసి దివాకర్ రెడ్డి భేటీ, తెలంగాణకు కౌంటర్ ప్లాన్

సమైక్యాంధ్ర కోసం తమ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర శానససభ్యులు శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం లేదనే అభిప్రాయం ఢిల్లీలో వ్యక్తమవుతోందని, ఈ స్థితిలో తాము తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ నెల 5వ తేదీన తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమవుతారని ఆయన చెప్పారు. శాసనసభ సమావేశాల బహిష్కరణపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశాలను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే.