శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాగు భూములు లాగేసిన ఘనత వైఎస్‌దే: టిడిపి అధినేత చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
శ్రీకాకుళం: సాగు భూములను బీడు భూములుగా మార్చి కర్మాగారాలు పెట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం ధ్వజమెత్తారు. ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడిన ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత మత్స్యకారులు తమ తమ గోడును చంద్రబాబుకు విన్నవించుకున్నారు. చంద్రబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెసు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. థర్మల్ ప్రాజెక్టును తొలగించే వరకు తెలుగుదేశం పార్టీ బాధితులకు అండగా ఉద్యమిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి, కాంగ్రెసు ప్రభుత్వంలో ఎవరికైనా దమ్ము ఉంటే వట్టితాండ్రను సందర్శించాలని ఆయన సవాల్ చేశారు. అధికార ప్రభుత్వానికి సిగ్గు లేదన్నారు. మానవత్వంలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నారు. ప్రభుత్వానికి అమాయక ప్రజలను కాల్చే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రాజెక్టు సూత్రదారులు ఎవరో తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలను రక్షిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వారిపై కక్ష్య తీర్చుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తోందన్నారు.

ప్రభుత్వం బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైళ్లో ఉన్న ఆందోళనకారులను వెంటనే విడుదల చేయాలన్నారు. కాల్పుల ఘటనపై విచారణ జరిపించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

English summary
TDP President Chandrababu fired at government today in Srikakulam district. He challenged CM Kiran Kumar Reddy. He demanded government to withdraw police force from Kakarapalli village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X