వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు సాక్షిగా చీలిన తెలంగాణ, సీమాంధ్ర: గుత్తా వర్సెస్ కావూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gutta Sukhender Reddy-Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో గురువారం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా వాదించుకున్నారు. నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు గురువారం మొదటిసారి పార్లమెంటు వాయిదా పడిన అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రశ్నించిన కావూరిపై గుత్తా తీవ్రంగా స్పందించారు. ఎదురు పడ్డ కావూరితో మీరు రాజీనామాకు సిద్ధపడండి, నేను కూడా రాజీనామాకు సిద్ధపడతాను అని గుత్తా డిమాండ్ చేశారు. అంతకుముందే రాజీనామా లెటర్‌తో సిద్ధంగా వచ్చిన గుత్తా తాను రాజీనామా పత్రంపై సంతకం చేసి మీరు కూడా చేయండి. మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తేల్చుకుందామని సవాల్ విసిరారు.

దీంతో కావూరి ఆ కాగితాన్ని తీసుకొని పక్కకు విసిరేసి నేను ఎందుకు రాజీనామా చేయాలి అని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం నాకు ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో తెలంగాణ ఎంపీలు గుత్తాకు మద్దతుగా నిలబడ్డారు. కావూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీలు కూడా కావూరికి అండగా నిలబడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పర వ్యక్తిగత దూషణలు కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా కావూరి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీకి తెలంగాణ ఎంపీలు ఫిర్యాదు చేశారు. కావూరి ప్రణబ్, అహ్మద్ పటేల్‌ల అపాయింట్‌మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది.

English summary
Telangana and Seemandhra Congress MPs divided in to two groups in Parliament central hall on thursday. Nalgonda MP Gutta demanded Kavuri resignation, but he rejected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X