హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహాయ నిరాకరణతో తెలంగాణ ప్రజలు నష్టపోతారు: జెపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సహాయ నిరాకరణతో తెలంగాణ ప్రజలే నష్టపోతారని, సీమాంధ్ర శాసనసభ్యులు చేసే చర్యల వల్ల సీమాంధ్ర ప్రజలు నష్టపోతారని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గురువారం అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చెప్పారు. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వాదం పేరుతో అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తే ఆ ప్రభావం దీర్ఘకాలంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.

ఇటు తెలంగాణ ఎమ్మెల్యేలు, అటు సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసంబ్లీని స్తంభింపజేయడం సరికాదన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నా, విడిపోయినా ఎక్కడి ప్రజలు అక్కడే ఉంటారన్నారు. పలువురిలో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యల దృష్ట్యా సభను అడ్డుకోకూడదని సూచించారు. ప్రభుత్వం సభలో ప్రజలకు జవాబుదారిగా ఉండాలని అన్నారు. సమావేశాలు నడుస్తున్న తీరుపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందన్నారు.

English summary
Lok Satta president Jayaprakash Narayana suggested Seemandhra and Telangana MLAs to support assembly session to run smoothly. He said Telangana people will loose with government Employees Non Co-Operation movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X