• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మాకూ చీము, నెత్తురు ఉంది, ఒత్తిడి పెంచేందుకే: జూపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews
Jupalli Krishna Rao
హైదరాబాద్: తెలంగాణలో సాధనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడానికి తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని దేవాదాయ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చెప్పారు. గత డిసెంబర్ 23న తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పుడే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లి తెలంగాణ కోసం రాజీనామాలకు కూడా సిద్ధమని ప్రకటించామన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక చూసిన తర్వాత కూడా తెలంగాణ ఇవ్వకుంటే రాజీనామాకు సిద్ధమని ప్రకటించినట్లు గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు అనుకూలంగా బిల్లు పెడితేనే ఉంటామని, లేదంటే రాజీనామాలకు సిద్ధపడతామని తాము చెప్పానని అందుకే రాజీనామా చేశానని చెప్పారు. తెలంగాణ సమస్య ఈనాటిది కాదన్నారు. ఇది 56 సంవత్సరాల ఉద్యమం అన్నారు. తెలంగాణ కోసం నాలుగుకోట్ల ప్రజలూ ఉద్యమిస్తున్న సమయంలో కూడా కేంద్రం స్పందించక పోకపోవడం వల్లనే అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడానికి రాజీనామాకు సిద్ధపడ్డానని చెప్పారు. అందరూ ఉద్యమిస్తున్నప్పుడు నేను చూస్తు కూర్చోలేనన్నారు.

త్యాగాలకు మారుపేరు తెలంగాణ అని అన్నారు. పౌరుషంలో తెలంగాణ అందరికంటే ముందు ఉంటుందన్నారు. నాకూ చీము, నెత్తురు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకుండా మంత్రిగా నేను ఎలా ఉండగలను అని అన్నారు. ఉద్యమాలు చేసిన తెలంగాణ నేతలపై నోరుంది కదాని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారని ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావును ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఇస్తుందని కాంగ్రెస్ పార్టీపైన, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపైన నమ్మకం ఉందన్నారు. తెలంగాణ తప్పకుండా సాధిస్తామన్నారు. బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టవలసిందిగా కోరుతూ సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపిస్తున్నానని, అయితే సమావేశాలలో బిల్లు పెట్టకుండే గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపిస్తానని చెప్పారు. తెలంగాణ ఇస్తే ఎవరికీ నష్టం ఉండదన్నారు. గత డిసెంబర్‌ 9న కేంద్రం ప్రకటించిన తెలంగాణను కొందరు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారని, ఇప్పుడు కూడా అలాగే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సీమాంధ్రులు ఇక్కడ బ్రతకవచ్చునన్నారు. కానీ వారికి ఉన్న అంగబలం, ఆర్థికబలంతో తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. మనం ఆత్మీయంగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి బ్రతుకుదామని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. నాకు టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణపై ఒత్తిడి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో సోనియాకు రాజీనామాను పంపిస్తున్నానని చెప్పారు. బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ ప్రకటించమని చెబితే గవర్నర్‌కు లేఖ ఇస్తామని అందుకు వెనక్కి వెళ్లేది లేదన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికే నాకు శాఖపైన అసంతృప్తి ఉందని సీమాంధ్ర నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు.

తెలంగాణ కోసం నావంతు కృషిగా నేను రాజీనామా చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్‌పై నమ్మకం లేక రాజీనామా చేయడం లేదని, త్వరగా ఇవ్వాలని ఒత్తిడి తేవడానికే అన్నారు. తెలంగాణ కంటే చిన్న దేశాలే 70కి పైగా ఉన్నాయన్నారు. మంత్రిగా రాజీనామా చేస్తున్నానని, ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం లేదని చెప్పారు. ఆత్మసాక్షిగా రాజీనామా చేస్తున్నానని ఎవరి గురించే చేయడం లేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగులంతా సహాయ నిరాకరణ చేస్తుండగా, విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని చెప్పారు. కాగా అంతకుముందు జూపల్లి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించి వచ్చారు.

English summary
Minister Jupalli Krishna Rao said he resigned for his ministry to put pressure on High Command. He demanded centre to propose Telangana bill in parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X