మేం అసెంబ్లీలో లేనప్పుడు అలా వ్యవహరించారు: టిడిపి నేత నాగం

తెలంగాణలోనే తెలంగాణ ద్రోహులు ఈనాడు కొత్తగా లేరన్నారు. నాడు 1956 నుండి నేటి వరకు తెలంగాణ ద్రోహులు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నారన్నారు. అసెంబ్లీలో గురువారం సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించడాన్ని తనను చాలా బాధ పరిచిందన్నారు. మేం అసెంబ్లీలో లేని సమయంలో ఈ విధంగా వారు వ్యవహరించారన్నారు. సీమాంధ్రలో ఏ ఉద్యమం ఉందని వారు ప్లకార్డులు పట్టుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రజల ఆకాంక్షను చూడాలని కోరారు. ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి వ్యాఖ్యలను నాగం ఖండించారు. కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే మేం కూడా రాజీనామాకు సిద్ధమని అన్నారు.












Click it and Unblock the Notifications