హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అడ్డుకోవడానికి చంద్రబాబుతో కాంగ్రెసు నేతల మంతనాలు: గండ్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికే మా పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు కొందరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో మంతనాలు జరుపుతున్నారని తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి గురువారం ఆరోపించారు. సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల వారు తెలంగాణను అడ్డుకోవడానికి వ్యూహాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇరుప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సభలో టిడిపి ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ మరోవైపు రెండు కళ్ల సిద్ధాంతం అంటూ టిడిపి ప్రవచిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. సమైక్యవాదాన్ని కోరుతున్న నాయకులు నిన్నటి వరకు బాగానే ఉన్నారని, అయితే తెలంగాణ అడ్డుకోవడానికి ఇప్పుడు మాత్రం పార్టీలకతీతంగా మంతనాలు చేస్తున్నారన్నారు.

ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుకు ఇక్కడి ప్రజల మనోభావాలు తెలియజేసేందుకే తెలంగాణ లాయర్లు ఆయన ఇంటికి వెళ్లారన్నారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడిన విషయాలు మాత్రం తెలంగాణ ప్రజలన మనోభావాలను కించపర్చే విధంగా ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. దేశంలో 500 రాష్ట్రాలు, జిల్లాకో రాష్ట్రం అయినా తనకు అభ్యంతరం లేదని వ్యంగంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాపై ప్రశ్నించడాన్ని గండ్ర తప్పు పట్టారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు కావూరి వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణపై ఎప్పుడు ఏం చేయాలో తెలుసన్నారు. అధిష్టానాన్ని ఒప్పించి తప్పకుండా తెలంగాణ తీసుకు వస్తామని చెప్పారు. ఆయన సలహాలు మాకు అవసరం లేదన్నారు. తెలంగాణ ఏ పద్ధతిలో తీసుకు రావాలో తెలుసున్నారు.

తెలంగాణ సాధన కోసం ఏం చేయాలో అందరం భేటీ అయి నిర్ణయించుకుంటామని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎవరిపైనా దాడి చేయాల్సిన అవసరం లేదన్నారు. గాంధేయ పద్ధతిలో పోరాడి తెలంగాను సాధించుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకోవాలని కోరారు. మా ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారన్నారు. బుధవారం కావూరి వ్యాఖ్యల ద్వారా, నేడు టిడిపి చర్యల ద్వారా సీమాంధ్ర నేతల నైజం, చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు తీసుకునే నిర్ణయానికి వారే బాధ్యులు అన్నారు.

English summary
Congress MLA Gandra Venkata Ramana Reddy allegated that seemandhra Congress leaders met TDP president Chandrababu to obstruct Telangana. He condemned Eluru MP Kavuri Sambasiva Rao comments on Telangana leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X