ప్లకార్డులతో పార్టీకి సంబంధం లేదు: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై యనమల
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు గురువారం తీవ్రంగా ఖండించారు. గురువారం ఉదయం శాసనసభ సమావేశాల సందర్భంగా సభలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రదర్శించిన ప్లకార్డులు తమ తమ వ్యక్తి గత నిర్ణయాలు అని వివరించారు. తమ సమైక్యాంధ్ర ప్లకార్డుల ప్రదర్శనకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ప్లకార్డుల ప్రదర్శన వ్యక్తిగత అభిప్రాయమే అని చెప్పారు. ప్లకార్డుల ప్రదర్శనపై చంద్రబాబు తన వివరణ ఇవ్వాలని కిషన్‌రెడ్డి చెప్పడం అర్థరహితం అన్నారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు తమ వాణిని వినిపించారని, తమ అభిప్రాయం వ్యక్తపరిస్తే తప్పేమిటి అన్నారు.
TDP senior MLA Yanamala Ramakrishnudu condemned BJP state president Kishan Reddy comments on TDP president Chandrababu today. He clarified that TDP MLAs United Andhra Pradesh slogans are not related to Party.
Story first published: Thursday, March 3, 2011, 11:41 [IST]