రాజీనామాలకు సిద్ధపడిన కె. చంద్రశేఖర రావు, విజయశాంతి?

పార్లమెంటులో తమతో సహా ఎన్డీఏ పక్షం, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సభ్యులు సమావేశాలను స్తంభింపజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనట్లుగా వ్యవహరించడంపై కెసిఆర్, విజయశాంతి మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేత, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు తెలంగాణ ఏర్పాటుపై తీవ్రవ్యాఖ్యలు చేయడం, రాజీనామాలు చేయాలంటూ సవాలు విసరడం, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ కోసమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తదితర పరిణామాలపై తన సన్నిహితులతో కేసీఆర్ గురువారం చర్చించారు. శుక్రవారం కూడా పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై వాయిదా తీర్మానం ఇద్దామని, సభలో చర్చకు పట్టుపట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు. కేంద్రం దిగిరాకుంటే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications