హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీఆర్పీ ఆధ్యక్షుడి హోదాలో చిరంజీవి చివరి సమావేశం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prajarajyam
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు, ఆఫీసు బేరర్లు, తదితరులతో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడి హోదాలో మెగాస్టార్ చిరంజీవి సోమవారం చివరిసారిగా సమావేశం కానున్నట్టు సమాచారం. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు‌లో విలీనం చేస్తున్నట్టు చిరంజీవి న్యూఢిల్లీలో గతంలోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే అధికారికంగా ఆ తంతు ఇంకా పూర్తి కాలేదు. పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఇప్పటికే తమ తమ అంగీకారం తెలిపినప్పటికీ, పార్టీ ప్రతినిధుల అంగీకార పత్రాన్ని ఎన్నికల సంఘానికి పంపవలసిన దృష్ట్యా సాధారణంగా సమావేశమై అందరి నిర్ణయాన్ని తీసుకొని అధ్యక్షుడి హోదాలో చిరంజీవి పంపించనున్నారు.

మార్చి 7వ తారీఖున సోమవారం చిరంజీవి పార్టీ కార్యాలయంలో భేటీ కానున్నారు. రాష్ట్ర కార్యవర్గంజిల్లా కార్యవర్గం, జిల్లా కార్యవర్గంతో చిరంజీవి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సుమారు వెయ్యి మందికి పైగా ఆఫీసు బేరర్లు పాల్గొననున్నారు. పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి చివరగా మాట్లాడుతారు. విలీనంపై వారి వారి అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఆయన తీసుకున్న విలీనం నిర్ణయాన్ని పార్టీ ఆమోదించినందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపి పార్టీ అనుబంధ సంస్థలను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Leaders, office bearers and political affairs committee of PRP would meet for the last time on Monday next to finalise the formal obligatory letter of approval from the party on its merger with Congress to be sent to Election commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X