తెలంగాణ పాపం వైఎస్‌దే, సోనియా బాధ్యురాలు: సీమాంధ్ర టిడిపి

ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీలే ముద్దాయిలు అన్నారు. సమస్యపై ఢిల్లీ వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను రాష్ట్రానికి పంపించి మేం సమస్యను తీరుస్తామని చెప్పి అర్ధరాత్రి ప్రకటించడం ఎంత వరకు సమంజసం అన్నారు. అర్ధరాత్రి ప్రకటించి రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేశారన్నారు. డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు ముందు కనీసం వారి కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చించలేదన్నారు.
పార్టీలో చర్చించుకుంటే విజయవాజ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. అధికారం కోసమే ప్రాకులాడుతోందన్నారు. ప్రభుత్వాలు ప్రజా సమస్యలనే పట్టించుకోవడం లేదన్నారు. 60 సంవత్సరాలుగా వస్తున్న సమస్యను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, పివి నరసింహారావులే తీర్చలేక పోయారు మేం ఎలా తీర్చగలం అని చిదంబరమే స్వయంగా చెప్పారన్నారు. డిసెంబర్ 9వ రాత్రికి రాత్రే ప్రకటన చేసే ముందు ఏ పార్టీని వారు సంప్రదించలేదన్నారు. వారి ప్రకటనతో రాష్ట్రాన్ని అగ్నిగుండే చేశారన్నారు. వారు చేసిన పాపానికి రాష్ట్రం ఖర్మ అనుభవిస్తుందన్నారు.