వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జబల్పూర్ విశ్వవిద్యాలయంలో మార్కులకు సెక్స్ స్కామ్

ఈ కేసులో నిందితులైన ప్రేర్నా అత్వాల్ అనే విద్యార్థి, అజయ్ ఖండేల్వాల్ అన్ వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాల గత నెల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం స్టూడెంట్ ఎస్ ఆర్య చేసిన ఫిర్యాదు ప్రకారం - రీవాల్యుయేషన్‌లో మార్కులు పెరగాలంటే ఖాన్‌తో పడుకోవాలని కళాశాలలో ఆమె సీనియర్ ప్రేరణ సూచించింది. రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు ఫలితాలు ఇంకా వెలువడక ముందే ప్రేరణ చెప్పింది. విశ్వవిద్యాలయంలో ఖాన్‌కు సంబంధాలున్నాయని, పాస్ చేయిస్తారని చెప్పింది. దీంతో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం సమాధాన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.