పరీక్షల్లో విద్యార్థుల్లో ఆందోళన, వాయిదా లేదంటున్న ప్రభుత్వం
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ వాయిదా పడబోదని తెలంగాణ రాజకీయ జెఎసి, పరీక్షలను వాయిదా వేసేది లేదని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని రాధిక హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం శుక్రవారం మరోసారి స్పష్టం చేసింది. రిటైర్ట్ లెక్చరర్లతో పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 10వ తేదీన మిలియన్ మార్చ్ జరగనుంది. ఆ రోజు నిర్వహించే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్ -2 పరీక్షను వాయిదా వేయాలని కొన్ని సంఘాలు కోరుతున్నాయి.
అయితే, అందుకు ప్రభుత్వం ఇష్టపడడం లేదు. దీంతో మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై ఇతర రాజకీయ పార్టీలు ఒత్తిడి పెడుతున్నాయి. అయితే, మార్చ్‌ను వాయిదా వేసుకోవడానికి తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ నిరాకరించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పెద్ద యెత్తున ఆ రోజు తెలంగాణ జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాదుకు తరలి వచ్చే అవకాశాలున్నాయి.
Students are in confusion and agitated mood on exams to be held as decided or postponed. Telangana political JAC rejected to postpone its Million March to Hyderabad on March 10. Government is stating that exams will be conducted as scheduled.
Story first published: Friday, March 4, 2011, 11:54 [IST]