తాజా పరిస్థితి వల్ల రాష్ట్రపతి పాలనే మేలు: అంబటి రాంబాబు

ప్రస్తుత స్థితికి ఏకైక పరిష్కార మార్గం రాష్ట్రపతి పాలన విధించడమొక్కటేనని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమాల నేపధ్యంలో కేంద్రం సమస్యకు త్వరగా పరిష్కార మార్గం చూపాలని, లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ కొత్తపార్టీ ప్రకటనకు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరుకల్లా పార్టీ ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications