కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు డుమ్మా: సభ్యులు లేక శాసనసభ వెలవెల

శనివారం నుంచి సిపిఐ సభ్యులు కూడా సమావేశాలను బహిష్కరిస్తున్నారు. తెలంగాణ శాసనసభ్యులు బహిష్కరించిన నేపథ్యంలో, తెలుగుదేశం సీమాంధ్ర సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలను విరమించుకోవడంతో సభా కార్యక్రమాలు శనివారం సజావుగానే సాగాయి. కానీ సభ్యులే సభ పట్ల తీవ్ర అనాసక్తి ప్రదర్శించినట్లు అర్థమవుతోంది.
కాగా, మజ్లీస్, లోకసత్తా, బిజెపి సభ్యులు శనివారం ఉదయం సభకు రాలేదు. సభకు 17 మంది మంత్రులు వచ్చారు. తెలుగుదేశం సభ్యులు 13 మంది, కాంగ్రెసు సభ్యులు ఏడుగురు, ప్రజారాజ్యం సభ్యులు నలుగుగురు, సిపిఎం సభ్యుడు ఒకరు సభకు హాజరయ్యారు. ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభమైన శాసనసభా సమావేశాల్లో తొలిసారి శనివారం ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.