జగన్ వర్గం కిడ్నాప్ చేసింది: హైకోర్టులో ఎంపిటిసి భార్య పిటిషన్

స్థానిక సం స్థల ప్రతినిథుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దొమ్మ ర నంద్యాల గ్రామంలో రెండో ఎంపీటీసీ సభ్యుడైన తన భర్తను జమ్మలమడుగు ఎ మ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి అనుచరుడు లక్ష్మయ్య కిడ్నాప్ చేశారని పిటిషన్‌లో ఆమె ఆరోపించారు. తన చుట్టూ మనుషులను పెట్టి ఎటూ కదలనీయకుండా నిర్బంధించారని, తనను విడిపించడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందేనని తన భర్త ఫోన్‌లో చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఎంపీటీసీ వాయిస్ ను పిటిషనర్ తరపు న్యాయవాది డివిజన్ బెంచ్‌కు విన్పించారు. ఈ వాదనలు విన్న హహైకోర్టు కిడ్నాప్‌నకు గురైన ఎంపీటీసీ ఆచూకీ కనుగొని కోర్టు ముందుంచాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications