వైయస్ జగన్‌కు ఊరట, నోటీసు ఇవ్వలేదని చెప్పిన ఎన్నికల కమిషన్

పార్టీ జెండా ఆవిష్కరణ కోడ్ ఉల్లంఘన కిందికి రాదని, అయితే ఆ కార్యక్రమం సందర్భంగా కోడ్‌ను ఉల్లంఘించకూడదని ఆయన చెప్పారు. కాగా, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. వైయస్ జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన బంధువు కొండా రెడ్డికి నోటీసు అందజేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి బ్రేకులు పడినట్లు చెప్పారు.
జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైయస్ జగన్‌తో పాటు ఆయన తల్లి వైయస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పులివెందుల చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాలకు విజయమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పులివెందులకు వైయస్ జగన్ అభిమానులు కూడా చేరుకున్నారు.












Click it and Unblock the Notifications