హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్ర నేతలపై బుసకొట్టిన తెలుగుదేశం నేత నాగం జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: విగ్రహాల ధ్వంసంపై రగడ చేస్తున్న సీమాంధ్ర నాయకులపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విగ్రహాలు కూలిపోతే మాట్లాడుతున్న సీమాంధ్ర నాయకులు తెలంగాణ కోసం 600 మంది చనిపోతే వారి కుటుంబాలను ఎందుకు పరామర్సించడం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. విగ్రహాల ధ్వంసంపై శానససభలో ఆరు గంటల పాటు చర్చించిన సీమాంధ్ర శానసభ్యులు విద్యార్థులు మరణాలపై ఎందుకు చర్చించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై హత్యాయత్నం కేసు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు.

తెలంగాణ ఉద్యమం సునామీలా మారిందని, దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం సీమాంధ్ర శాసనసభ నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్, డిజిపి అరవింద రావు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై హత్యా కేసు నమోదు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు విదేశీయులా, హైదరాబాద్ రావాలంటే వీసాలూ పాస్‌పోర్టులూ తీసుకోవాలా అని ఆయన అడిగారు. వందలాది చెక్ పోస్టులు ఎందుకు పెట్టారని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛ కూడా లేదని ఆయన అన్నారు.

English summary
TDP Telangana region MLA Nagam Janardhan Reddy lashed out at Seemandhra leaders. He criticised that Seemandhra leaders are condemning distruction of statues and ignoring students, who sacrificed their life for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X