చిరంజీవి బాటలోనే జగన్, సిఎం పదవికే పార్టీ: చంద్రబాబు

దివంగత వైఎస్ చేసిన అవినీతిలో కాంగ్రెస్‌కు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. ఆ పాపంలో కాంగ్రెస్ పాలుపంచుకుందన్నారు. జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ పెడుతున్నారన్నారు. పదవుల కోసం పార్టీ పెడితే మనుగడ సాధించలేవన్నారు. జగన్ తన తండ్రినుండి తనకు అక్రమ ఆస్తులు వారసత్వంగా వచ్చినట్టే ముఖ్యమంత్రి పదవి కూడా వస్తుందని భావించారన్నారు. జగన్ తన పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టడం ద్వారా తాను కాంగ్రెస్ వేరు కాదని చెప్పకనే చెప్పారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం విద్యుత్ సరిగా సరఫరా చేయలేక పోతోందన్నారు. తొమ్మది గంటలు ఉచిత విద్యుత్ అని చెప్పిన ప్రభుత్వం కనీసం ఆ మేరకు మాట నిలబెట్టుకోలేక పోతోందన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 1994లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనుండి దిగిపోయిన పరిస్థితే కనిపిస్తోందన్నారు. మా బలం ఆధారంగా మేం రాజకీయాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications