వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దంతెవాడలో ఎన్‌కౌంటర్, 25 మంది మావోయిస్టుల మృతి?

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సోమవారం మధ్యాహ్నం ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం వరకు ఇవి కొనసాగాయి. చీకటి పడడంతో భద్రతా బలగాలు వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 70 మందితో కూడిన భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నట్లు సమాచారం. వారు గాలింపు చర్యలు చేపట్టినప్పుడు దాదాపు 50 మంది మావోయిస్టులు తారసపడ్డారని, భద్రతా బలగాలను చూడగానే వారు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని అంటున్నారు.
మావోయిస్టులు ఎంత మంది మరణించారనే విషయంపై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. టీవీ చానెళ్లలో ఈ సంఖ్య పలు రకాలుగా వస్తోంది. మరణించిన మావోయిస్టులు 25 మంది ఉంటారని, 11 మంది మాత్రమే ఉన్నారని, పది మాత్రమే మరణించారని వార్తలు వస్తున్నాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా అనే విషయం తేలడం లేదు.