సభకు ఎమ్మెల్యేలు: ఫలించిన సిఎం, డిఎస్ దౌత్యం

కేంద్రం నిర్ణయం ప్రకటించే వరకు సమావేశాలకు హాజరు కావాలని సిఎం, డిఎస్ నచ్చజెప్పటంతో వారు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఎట్టకేలకు వారు శాసనసభ సమావేశాలకు హాజరవుతామని చెప్పారు. కాగా సమావేశంలో డిఎస్ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అధికార సభ్యులుగా ఉండి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లక పోవడం ఏమిటని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సభకు వెళ్లక పోవడం మంచిది కాదని సూచించారు.
సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. సభ నడుస్తుంటే టిజెఎఫ్ పోటీ అసెంబ్లీకి ఎలా వెళతారని ఆయన వారిని ప్రశ్నించారు. బయట ఉండి మీరు సాధించినది ఏంటని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications