వైయస్ జగన్ భయం: కాంగ్రెసు ఎమ్మెల్యేలకు విప్ జారీ

పది స్థానాలకు 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెసు ఏడు స్థానాలకు, మిత్రపక్షం సిపిఐతో కలిసి తెలుగుదేశం నాలుగు స్థానాలకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క సీటుకు పోటీ చేస్తున్నాయి. ఏడో స్థానాన్ని గెలుచుకోవడానికి కాంగ్రెసుకు, నాలుగో స్థానాన్ని గెలుచుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేదు. అలాగే, తెరాసకు ఒక్క అభ్యర్థిని గెలుచుకోవడానికి శాసనసభ్యుల సంఖ్య సరిపోదు.
ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు క్రాస్ వోటింగ్‌కు పాల్పడుతారేమోనని కాంగ్రెసు నాయకత్వం భయపడుతోంది. అయితే, తమకున్న సంఖ్యాబలాన్ని బట్టే అభ్యర్థులను దించామని, తమ శాసనసభ్యులు క్రాస్ వోటింగ్‌కు పాల్పడబోరని మల్లుభట్టి విక్రమార్క అంటున్నారు. అయితే, క్రాస్ వోటింగ్ భయం వల్లనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీక్రెట్ కోడ్ విధానాన్ని అవలంబిస్తున్నారు.












Click it and Unblock the Notifications