వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఐదుగురు సినీరంగాన్ని నాశనం చేస్తున్నారు: నట్టి కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Natti Kumar
హైదరాబాద్: ఐదుగురు పెద్దలు తెలుగు సినీ రంగాన్ని నాశనం చేస్తున్నారని తెలుగు సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. సినిమా రేట్లు పెంచాలని ఆ ఐదుగురి డిమాండ్‌ను ఆయన వ్యతిరేకించారు. ఈ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన సోమవారం మాట్లాడారు. సినిమా రేట్లు పెంచడం వల్ల చిన్న సినిమాలు నష్టపోతాయని ఆయన అన్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్న ఆ నిర్మాతలు వారం, రెండు వారాల్లో ప్రజల నుంచి డబ్బులు రాబట్టుకోవాలని అనుకుంటున్నారని, దీని వల్ల చిన్న నిర్మాతలు నష్టపోతారని ఆయన అన్నారు.

సినిమా రేట్లు పెంచడం వల్ల పైరసీ మరింతగా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతల అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఆ ఐదుగురు ముఖ్యమంత్రిని కలిసి టికెట్ రేట్లు పెంచాలని కోరారని ఆయన చెప్పారు. తామంతా నిర్మాతలం కాదా ఆయన అడిగారు. టికెట్ రేట్లు పెంచితే తాము ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ ఏళ్ల తరబడి సినిమాలు నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. నిర్మాతల మండలి నిర్ణయం గానీ ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలను కాదని ఆ ఐదుగురు పెద్దలు నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి టికెట్ ధరలు పెంచాలని కోరారని ఆయన చెప్పారు.

ఈ ఫిల్మ్ నగర్ మాది, తెలుగు సినీ రంగం మాది అనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారని, తమను కాదని చేస్తే సర్వనాశనం అవుతారని, అవుతున్నారని ఆయన చెప్పారు. వారు తీసిన భారీ సినిమాలు బాక్సాఫీసు వద్ద దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెంపు వ్యవహారంలో ఓ కుంభకోణం ఉందని, ఆ కుంభకోణం బయటపడుతుందని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెరిగితే చిన్న సినిమాలు ఎక్కువ కాలం ఆడబోవని ఆయన అన్నారు.

English summary
Producer Natti Kumar opposed the proposal of hike in cinema ticket rates. He accused that 5 big producers are conspiring agianst small producers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X