వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ అక్రమ ఆస్తులపై ఈడితో విచారణ?: టిడిపి వినతికి ప్రధాని సానుకూలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి సంస్థలోకి అక్రమ ఆస్తులు భారీగా తరలి వచ్చాయని వాటిపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి విన్నవించారు. ఈడితో విచారణకు జరిపించాలని వారు చేసిన డిమాండ్‌కు ప్రధాని సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్‌పై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ మైసూరారెడ్డి చెప్పారు. జగన్‌కు చెందిన పార్టీని చూసి భయపడే స్థితిలో లేమని అన్నారు. జగన్ అక్రమ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ ఎప్పటినుండో పోరాడుతుందన్నారు.

జగతి పబ్లికేషన్‌లో వాటాలు పూర్తిగా అక్రమమైనవని అన్నారు. అందులో ఎవరెవరు ఎంత పెట్టారో వారి వారి వాటాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అక్రమ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. జగన్ ప్రభావం రాష్ట్రంలో నామ మాత్రమే అన్నారు. పార్లమెంటులో లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ప్రధానికి ఐదు పేజీల లేఖను ఎంపీలు అందించారు. జగన్ ఏఏ సంస్థలలో పెట్టుబడులు పెట్టారు, ఆయన సంస్థలలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారనే రెండు కోణాల్లో విచారణ జరిపించాలని కోరినట్లుగా తెలుస్తోంది.

English summary
TDP MP Mysoora Reddy said that TDP is not afraid of Ex MP YS Jagan's party. He said TDP is fighting against Jagana illeagal acting since many years. TDP MPs were met prime minister and demanded to enquiry on Jagathi publications investments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X