కెసిఆర్‌ను నిలదీసిన డిఎస్, సోనియాను కలవాలని సూచన

తెలంగాణపై తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని చెప్పారు. తాము ఇంత ఒత్తిడి కేంద్రంపై తీసుకు వస్తుంటే కేవలం సింగిల్ ఎజెండాతో పార్టీ పెట్టిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఅర్ మాత్రం ఏ మేరకు ఒత్తిడి తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం అంటూ అధికార పక్షాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షాల వద్దకు వెళ్లడం ఎంత వరకు సమంజసం అన్నారు.
కేంద్రం కూడా తెలంగాణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తమ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications