లగడపాటి చిల్లరదొంగలా పారిపోయి వచ్చాడు: కిషన్ రెడ్డి

విగ్రహాల విధ్వంసంలో లగడపాటి ఓ రాజకీయ అజ్ఞాని అని, లగడపాటికి తమపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం విజయవాడలో దీక్షలు చేపట్టి చిల్లరదొంగలా హైదరాబాద్‌కు పారిపోయి వచ్చారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విగ్రహాల విధ్వంసంపై తమపై ఆరోపణలు చేసే ముందు లగడపాటి జరిగిన వాస్తవాలను తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. లేకుంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విగ్రహాల విధ్వంసం వెనుక తమ పార్టీ కార్యకర్తల హస్తం లేదని ఆయన స్పష్టం చేశారు.
అవసరమైతే లగడపాటి రాజగోపాల్ డిటెక్టివ్ ఏజెన్సీతో విగ్రహాల విధ్వంసంపై దర్యాప్తు చేయించుకోవచ్చునని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ ప్రకటనలకు, విమర్సలకు, వ్యాఖ్యలకు తమ పార్టీ భయపడబోదని ఆయన అన్నారు. తమ పార్టీ లడగపాటి రాజగోపాల్ వంటివారిని ఎంతో మందిని చూసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications