ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లకు బోనస్ బొనాంజా

సంస్థలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవాస భారతీయుడు నికిష్ అరోరా బోనస్‌గా 2.7 మిలియన్ డాలర్లను అందుకోనున్నారు. సంస్థ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అలాన్ ఎసుటాక్‌కు 1.8 మిలియన్ డాలర్లు, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ జోనాథన్ రోసెన్‌బర్గ్‌కు 1.7 మిలియన్ డాలర్లు బోనస్‌గా లభించనుంది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న గూగుల్ 2011 సంవత్సరానికి గాను కొంత మొత్తం ఈక్విటీలను కూడా వీరికి ప్రకటించింది.
పిచెట్‌కు 15 మిలియన్ డాలర్లు, అరోరాకు 20 మిలియన్ డాలర్లు, ఎసుటాక్‌కు 10 మిలియన్ డాలర్లు, రోసెన్‌బర్గ్‌కు 5 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను బహుమతిగా ఇస్తున్నట్టు తెలిపింది. కాగా, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎరిక్ స్కిమిడ్త్, కో-ఫౌండర్ లారీ పేజ్, సెర్గె మ్రిన్‌లకు ఎటువంటి బోనస్, ఈక్విటీలు ఈ సంవత్సరంలో లేవు. ఈ ముగ్గురూ 2004 నుంచి ఒక డాలర్ వేతనానికి సంస్థలో విధులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టాప్ మేనేజ్‌మెంట్‌లోని మరింతమందికి, వివిధ దేశాల్లో సంస్థకు హెడ్‌లుగా పనిచేస్తున్న వారికి కూడా బోనస్, ఈక్విటీలను అందిస్తున్నట్టు గూగుల్ తెలిపింది.