హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురువారం వోటేశారు. పది మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవడానికి గురువారం ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పది స్థానాలకు 12 మంది అభ్యర్థులు పోటీ పడుతుండడంతో వోటింగ్ అనివార్యంగా మారింది. ఈ ఎన్నికల్లో తొలి వోటును మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫును తొలి వోటును మండవ వెంకటేశ్వర రావు వినియోగించుకున్నారు.

కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన తెలుగుదేశం తిరుగుబాటు శానససభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి కూడా ఓటేశారు. వారికి తెలుగుదేశం పార్టీ మరోసారి విప్ జారీ ప్రయత్నం చేసింది. కానీ వారు సంతకం చేయడానికి నిరాకరించారు. దీన్ని బట్టి వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వోటేశారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్న వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు వోటేయాలని ముఖ్యమంత్రి వారిని కోరారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బిజెపి అధ్యక్షుడు, శాసనసభ్యుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి మహమూద్ అలీకి వోటేయాలని ఆయన కిషన్ రెడ్డిని కోరారు. బిజెపికి ఇద్దరు శాసనసభ్యులున్నారు. ఉదయం పదిన్నర గంటల వరకు 35 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది.

English summary
Prajarajyam party MLA Chiranjeevi franchised his voting right in MLC election along with minister Botsa Satyanarayana. Ex MP YS Jagan camp MLAs met Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X