టిడిపి అభ్యర్థికి కాంగ్రెస్ ఓటు: బాబు-కిరణ్ రహస్య అవగాహన

ప్రస్తుతం టిడిపికి, కాంగ్రెస్‌కు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి శత్రువులుగా ఉన్నారు. ఇటు టిఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు, జగన్‌ను తిప్పి కొట్టేందుకు వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. జగన్ వర్గం ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తామని చెప్పారు. జగన్‌ను టార్గెట్ చేసిన కాంగ్రెసుకు ఎందుకు వేయాలనే ఉద్దేశ్యంలో వారు ఉండగా, తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకోవాలనే వ్యూహంలో టిఆర్ఎస్ వారున్నారు. వీరిని అడ్డుకునేందుకే కాంగ్రెసు తన ప్రాధాన్యత ఓటును టిడిపికి వేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications