ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలంగాణ వస్తుంది: బాబా రామ్ దేవ్
Districts
oi-Srinivas G
By Srinivas
|
నిజామాబాద్: ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా గురువారం జై తెలంగాణ నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఉదయాన యోగా క్లాసులకు వచ్చిన వారితో కలిసి జై తెలంగాణ నినాదాలు చేశారు. వచ్చే జూన్‌లో రాజకీయ పార్టీని స్థాపిస్తానని చెప్పిన బాబా భారత్ స్వాభిమాన్ యాత్రలో భాగంగా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. రామ్‌దేవ్ బాబా యోగా పాఠాలు చెప్పడంతో పాటు దేశంలో నెలకొన్న సమస్యలపై కూడా స్పందిస్తున్నారు.
ఇప్పటికే వరంగల్, కరీంనగర్ జిల్లాలో తెలంగాణకు అనుకూల ప్రకటనలు చేసిన బాబా మరోసారి నిజామాబాద్‌లో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ తప్పకుండా వచ్చి తీరుతుందని చెప్పారు. ఇవ్వాళ కాకపోయినా రేపైనా తెలంగాణ రావాల్సిందేనన్నారు. తెలంగాణకు సీమాంధ్ర ప్రజలు అడ్డుకాదని కూడా చెప్పారు. రామ్‌దేవ్ బాబా సీమాంధ్రలో కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే.