కిరణ్‌కు వైయస్ జగన్ దెబ్బ: కీలెరిగి వాత పెట్టిన శాసనసభ్యులు

కాగా, అన్యూహంగా కాంగ్రెసు అభ్యర్థి రంగారెడ్డి విజయం సాధించారు. ఆయనకు 27 ఓట్లు పడ్డాయి. నిజానికి, కాంగ్రెసు అభ్యర్థి ఓడిపోపాల్సి ఉంటే రంగారెడ్డి ఓడిపోవాలి. కాంగ్రెసు అభ్యర్థులు పాలడుగు వెంకటరావు, చెంగల్రాయుడు, సుధాకర్ బాబు విజయం సాధించారు. వారికి కేటాయించిన 27 ఓట్ల చొప్పున పడ్డాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి సి. రామచంద్రయ్య కూడా విజయం సాధించారు. ఆయనకు 26 ఓట్లు పడ్డాయి. కాంగ్రెసు ఒక్కటేసి సీటును ప్రజారాజ్యం, మజ్లీస్‌లకు కేటాయించి, తమ అభ్యర్థులను ఐదుగురిని రంగంలోకి దించింది.
కానీ ఆయనకు జానీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించినట్లే. తెలుగుదేశం పార్టీ ముగ్గురు అభ్యర్థులు గెలవడానికి తగిన బలం ఉండగా, మిత్రపక్షం సిపిఐతో కలిపి నాలుగు సీట్లకు పోటీ చేసింది. నలుగురు అభ్యర్థులు కూడా విజయం సాధించినట్లే. సిపిఐకి చెందిన చంద్రశేఖర్‌తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన సతీష్ రెడ్డి, గంగాధర గౌడ్ విజయం సాధించారు. ప్రతిభా భారతి కూడా విజయం సాధించినట్లే. ఆమెకు 21 ఓట్లు వచ్చాయి.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మహ్మద్ అలీకి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజెపి రెండు ఓట్లు తెరాసకు పడలేదని భావిస్తున్నారు. అయితే తాము తెరాస అభ్యర్థికే ఓటు వేశామని, తెరాస శాసనసభ్యులే క్రాస్ వోటింగ్‌కు పాల్పడ్డారని జి. కిషన్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద, తెరాస, బిజెపి మధ్య తగాదా ప్రారంభమైంది. తెరాసలో ఎవరు క్రాస్ వోటింగ్‌కు పాల్పడ్డారో తేలిపోతుందని కిషన్ రెడ్డి అంటున్నారు.