ఆచూకీ లేని వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో టెన్షన్

జగన్‌తో ఉన్న 25 మంది శాసనసభ్యుల్లో 21 మంది కాంగ్రెసు పార్టీకి చెందినవారే. మిగతా నలుగురిలో ఇద్దరేసి తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలకు చెందినవారు. వారు వోటింగ్‌కు వస్తారా, లేదా అనేది అ సందేహమైతే, వోటింగుకు వస్తే ఎవరికి వోటేస్తారనేది మరో సందేహం. తమ వోటును వారు చెల్లకుండా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థికి ఓటేస్తే కె. చంద్రశేఖర రావుతో జగన్ కుమ్మక్కయ్యారనే ప్రచారానికి బలం చేకూరుతుందనే అభిప్రాయం వారిలో ఉంది. దీంతో విప్‌ను ఉల్లంఘించకుండానే కాంగ్రెసు పార్టీకి షాక్ ఇచ్చేందుకు వారు సిద్ధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications