హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మజ్లీస్ అభ్యర్థికి వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేల ఓటు?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లీస్ అభ్యర్థికి మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు ఓటేసినట్లు ప్రచారం జరుగుతోంది. శానససభ ఆవరణలో ఈ ప్రచారం గురువారం ఊపందుకుంది. జగన్ క్యాంప్ ఓటేస్తారా, లేదా అనే అనుమానాల మధ్య వారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు చేశారు. తమ ఆత్మప్రబోధానుసారమే ఓటేస్తామని వారు చెప్పారు. దీంతో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మహ్మద్ జానీ ఓడిపోయే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

కాంగ్రెసు పార్టీ ప్రజారాజ్యం పార్టీకి, మజ్లీస్‌కు ఒక్కటేసి టికెట్లు కేటాయించింది. విప్‌ను ధిక్కరించనట్లు కాకుండా, కాంగ్రెసును సమర్థించినట్లు కాకుండా జగన్ వర్గం ఎమ్మెల్యేలు మధ్యేమార్గాన్ని ఎంచుకుని కాంగ్రెసు బలపరిచిన మజ్లీస్ అభ్యర్థికి ఓటేసినట్లు ప్రచారం జరుగుతోంది. మహ్మద్ జానీ తనకు ఓటేయాలని అసమ్మతి శాసనసభ్యురాలు కుతూహలమ్మను వేడుకున్నారు. గురువారం ఉదయం తమ నాయకుడితో సమావేశమైన తర్వాత వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు.

తాము కాంగ్రెసు పార్టీకి చెందిన అభ్యర్థికి తాము ఓటేయబోమని వారు ముందే ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. కనీసం 12 ఓట్ల క్రాస్ ఓటింగ్ జరిగితే మహ్మద్ జానీ ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు. కాగా, బిజెపి శాసనసభ్యులిద్దరు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మహ్మద్ అలీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు.

English summary
There is a rumor that YS Jagan camp MLAs voted for MIM candidate in MLC election under MLA qouta. If Jagan MLAs resorted to cross voting, Congress candidate Mohammad Johny will be defeated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X