చంద్రబాబు చాతుర్యానికి సిపిఐ, టిడిపి ఎమ్మెల్యేలు దెబ్బ

టిడిపి మిత్ర పక్షానికి మొత్తం 93 ఓట్లు ఉండగా, ముగ్గురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అయితే నాలుగో అభ్యర్థి గెలిచే అవకాశాలు లేకున్నప్పటికీ టిడిపి ప్రతిభా పాటిల్‌ను రంగంలోకి దించారు. అందులోనే చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావించిన బాబు ప్రతిభను దింపారు. అయితే మొదట మొదటి ఇద్దరు అభ్యర్థులకు 25 చొప్పున, మూడో అభ్యర్థికి 24 చొప్పున ఎమ్మెల్యేలను కేటాయించి 19 మందిని ప్రతిభకు కేటాయించారు. అయితే ఎన్నికలు ప్రారంభం అయ్యాక జగన్ వర్గం వ్యూహం తెలియడంతో బాబు ప్రతివ్యూహం చేశారు.
మొదటి ముగ్గురు అభ్యర్థులకు 24, ప్రతిభకు 21 మంది ఎమ్మెల్యేలను కేటాయించినప్పటికీ మరో వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఇద్దరు అభ్యర్థులకు 24 ఓట్లు, మూడో అభ్యర్థికి 23, ప్రతిభకు 22 ఓట్లు వేయించాలని అలా అయితే నలుగురిని గెలిపించుకోవచ్చునని బాబు వ్యూహరచన చేశారు. అయితే ఒక అభ్యర్థికి ఓటు తగ్గించుకవడానికి సిపిఐ నిరాకరించడంతో పాటు, టిడిపి ఎమ్మెల్యేలు అసలుకే మోసం వస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేసి ససేమీరా అన్నారు. బాబు చేసేది లేక ఊరుకున్నారు. కానీ ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పుడు అందరూ చంద్రబాబు వ్యూహాన్ని అనుసరిస్తే నలుగురిని గెలిపించుకునే వాళ్లం కదాని ఆని బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications