తిట్టిన సిపిఎం రాఘవులుకు చంద్రబాబు నాయుడు మద్దతు

అటవీ హక్కుల చట్టం రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని కోరారు. దళి, గిరిజనులకు సరియైన మౌలిక సదుపాయాల కల్పించాలని అన్నారు. రాఘవులు దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. రాఘవులు దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
బిసి, ఎస్టీల సమస్యలపై నిరాహార దీక్షకు దిగిన సమయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అధికార పక్ష కాంగ్రెసుతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ఉదయం టిఫిన్ చేసి వచ్చి సభను వాయిదా వేయించుకొని పోతోందన్నారు. ప్రతిపక్ష సభ్యులంతా ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా నిద్రావస్థలో ఉన్నారని విమర్శించారు.