తోడి కోడళ్ల ఘాతుకం, నిప్పు పెట్టండో తల్లీకొడుకుల మృతి

పోలీసుల కథనం ప్రకారం - రామయ్య, ఉమా మహేశ్వరిలకు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఇద్దరు కుమారులు. ఓ కుమారుడి వయస్సు ఒకటిన్నర ఏడాది కాగా, మరో కుమారుడికి మూడేళ్ల వయస్సు. రామయ్యకు ఉమా మహేశ్వరి తల్లిదండ్రులు అంగీకరించిన మేరకు కట్నం ఇవ్వలేదు. దాంతో రామయ్య అన్నలు, వారి భార్యలు ఉమా మహేశ్వరిని వేధిస్తూ వస్తున్నారు.
చివరగా, ఉమా మహేశ్వరిని, ఆమె ఇద్దరు పిల్లలను పొలం వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన నుంచి ఉమా మహేశ్వరి మూడేళ్ల కుమారుడు తప్పించుకుని పారిపోయాడు. ఉమామహేశ్వరి, మరో కుమారుడు మాత్రం మరణించారు. వారి శవాలను మూట కట్టి పడేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications