సిపిఎం కార్యదర్సి బివి రాఘవులు దీక్ష భగ్నం, అస్పత్రికి తరలింపు

ప్రజల కోసం నాకు బతకాలనే ఉందని, మరణించాలని అనుకోవడం లేదని, అయితే ఈ ప్రభుత్వం ఎంతకాలం మమ్మల్ని బతకనిస్తుందో చూద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అంతకు ముందు అన్నారు. ఇక్కడి ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరాహారదీక్షలో ఉన్న రాఘవులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ- 'ప్రజల కోసం దీక్షలు విరమించండి' అని విజ్ఞప్తిచేసినప్పుడు రాఘవులు పైవిధంగా స్పందించారు.
తమ దీక్షల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటం పట్ల వారు నిరసన వ్యక్తంచేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే దాకా దీక్షల్ని కొనసాగిస్తామని రాఘవులు స్పష్టంగా చెబుతుంటే... అసలు ఆ దీక్షలే అవసరంలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించడం సీపీఎం శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది.