తెరాస అంతర్గత విషయాలపై కె. కేశవరావు నో కామెంట్

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణశాఖమంత్రి జైరాం రమేష్ చేసిన ప్రకటనను ఆహ్వానిస్తున్నట్టు కేశవరావు అన్నారు. పోలవరం అవసరమే కానీ దానికి ప్రత్యామ్నాయమార్గాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొందరు కాంగ్రెస్ శాసనసభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన అంశంపై పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సెజ్‌ల పేరిట భూకేటాయింపులు ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజుల ఆంధ్రప్రదేశ్‌నే సెజ్‌ల కోసం అమ్మివేస్తారని ఆయనన్నారు. సెజ్‌లపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.