హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగ్గురు తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్, కుదిపేసిన క్రాస్ ఓటింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ భూతం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కుదిపేసింది. క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటువేశారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ప్రకటన చేశారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఏనుగు రవీందర్‌రెడ్డి(ఎల్లారెడ్డి), కె.విద్యాసాగరరావు(కోరుట్ల), కావేటి సమ్మయ్య(సిర్పూర్‌ కాగజ్‌నగర్‌)లున్నారు. తమపై ఆరోపణలు రావడంతో ఏనుగు రవీందర్‌రెడ్డి, విద్యాసాగరరావు కావేటి సమ్మయ్యలు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విద్యాసాగర్‌రావు, రవీందర్‌రెడ్డిలు తమ ఖాళీ లెటర్‌ హెడ్‌లపై సంతకాలు చేసి కేసీఆర్‌కు ఇచ్చారు. కావేటి సమ్మయ్య తన లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పంపించినట్లు తెరాస వర్గాలు ప్రకటించాయి.

క్రాస్ వోటింగుకు పాల్పడినవారిని క్షమించాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భావించినా, అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పార్టీ పోలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చివరకు వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలుగా కొనసాగడానికి ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. మరో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పొలిట్‌బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. క్రాస్‌ఓటింగ్‌పై సమావేశంలో చర్చ జరుగుతుండడంతో ఆయన మధ్యలోనే బయటకొచ్చారు.

తాను పార్టీ ఆదేశాలను శిరసావహించి ఓటేశానని, తనపై నిందలు వేయొద్దని కోరారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నానని, తన చిత్తశుద్ధిని శంకించవద్దన్నారు. అయితే, తనపై ఆరోపణలు రావడంతో కలతచెందానని, అందుకే పార్టీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తమ అధినాయకుడు కేసీఆరేనని, ఆయనకే లేఖ ఇస్తున్నట్లు చెప్పారు. కాగా కేసీఆర్‌కు రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో పంపిన కావేటి సమ్మయ్య ఆదివారం స్వయంగా వచ్చి కేసీఆర్‌ను కలుస్తానని చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి.

English summary
Three TRS MLAs suspended for resorting cross voting in MLC election held under MLAs quota. Kaveti Sammmaiah, Vidyasagar Rao and Enugu Ravinder Reddy suspended by TRS on cross voting allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X