కాంగ్రెసు నేతగా తమిళనాడులో ప్రచారం, త్వరలో విలీనం సభ: చిరంజీవి

అంతటా ప్రచారం చేయమన్నా తాను సిద్ధమని చెప్పారు. తమిళనాడులో కాంగ్రెసు నేతగా ప్రచారం చేస్తానని చెప్పారు. విలీన సభకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా ఆహ్వానించానని చెప్పారు. ఆమె వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మంత్రివర్గ విస్తరణపై తాము చర్చించలేదన్నారు. మంత్రివర్గ విస్తరణలో పీఆర్పీ ఎమ్మెల్యేల అంశంపై చర్చించలేదన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు తాను ఎప్పుడూ వ్యతిరేకమన్నారు. అయితే వికీలీక్స్ అనేది ఆధార భూతం కాదని చెప్పారు.
కాంగ్రెసు పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిషలు సర్వశక్తులు ఒడ్డుతానని చెప్పారు. పీఆర్పీ ఎమ్మెల్యేలు ఎవరూ క్రాస్ ఓటింగుకు పాల్పడలేదన్నారు. అందరూ పార్టీ నిర్ణయం ప్రకారమే ఓటు వేశారని చెప్పారు. కాగా మొదట అహ్మద్ పటేల్‌తో సమావేశమైన చిరంజీవి ఆ తర్వాత ఆజాద్‌తో సమావేశం అయ్యారు. అయితే తమిళనాడు ఎన్నికలకు వెళ్లనున్న చిరంజీవి కాంగ్రెసు ఆశలు నిలబెడతారా లేదా చూడాలి.












Click it and Unblock the Notifications