దమ్ముంటే రండి హైదరాబాద్ గడ్డపై తేల్చుకుందాం: ఈటెల ఛాలెంజ్

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేని స్థితిలో కాంగ్రెసు, టిడిపి ఉన్నాయన్నారు. పార్టీ వ్యతిరేకులపై చర్యలు తీసుకోలేని వారు మాకు నీతులు చెప్పటం విచారకరమన్నారు. విజన్ 2020 అన్న చంద్రబాబు ప్రజల దృష్టిలో 420 అయ్యారన్నారు. మా పార్టీ నేతలపై అవాకులు చెవాకులు పేలే టిడిపి నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. టిడిపి ఆరోపణలు మానకుంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సొంత పార్టీ నేతలే టిడిపిని బహిరంగంగా విమర్శిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి టిఆర్ఎస్ ను విమర్శించే అర్హత లేదన్నారు.












Click it and Unblock the Notifications