అధికార పార్టీకి వ్యతిరేకంగా టిడిపి, జగన్ వర్గం ఆందోళన

అనంతరం టిడిపి నేతలు వచ్చి అధికార కాంగ్రెసు పార్టీ, జగన్ వర్గం నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆందోళనకు దిగారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. కాగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. జమ్మలమడుగులో కాంగ్రెసు, జగన్ వర్గం కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో కూడా టిడిపికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. కాగా పెద్దిరెడ్డిని అరెస్టు చేసినందుకు నిరసనగా జగన్ వర్గం నాయకులు సదుంలో బంద్ నిర్వహించారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది.
కాగా తిరుపతిలో వంద శాతం ఓటింగ్ జరిగింది. కడపలో ఇద్దరు సిపిఐ సభ్యులు ఎన్నికలను బహిష్కరించారు. కాగా జగన్ వర్గానికి చెందిన నేతలు కొందరు ఏలూరులో ఎమ్మెల్యేను అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది.