హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీలీనంపై కెసిఆర్ ఖండన: చిన్న పార్టీతో కలవమన్న విజయశాంతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసు పార్టీలో విలీనం అవుతుందన్న వార్తలు టిఆర్ఎస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. వార్తలు తీవ్ర కలకలం సృష్టించడంతో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు విలీనం వార్తలను ఖండించారు. కెసిఆర్‌తో పాటు టిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఈ వార్తలను ఖండించారు. కాంగ్రెసులో టిఆర్ఎస్ విలీనం అవుతుందన్న వార్తలు అవాస్తవమని కెసిఆర్ చెప్పారు. అసత్య వార్తలు మీడియా ప్రచారం చేయవద్దని కోరారు. తనతో సమావేశం అయిన కేబుల్ ఆపరేటర్లతో కూడా ఆ వార్తలను ఖండించాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.

వీలీనంపై పార్టీలో ఎప్పుడూ చర్చించలేదని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ అన్నారు. అయితే పార్టీకన్నా తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని చెప్పారు. విలీనం ప్రసక్తే లేదని మరో ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ ప్రజల కోసం పని చేస్తుందన్నారు. వార్తల్లో వాస్తవం లేదన్నారు. కాంగ్రెసు తీరు చూస్తుంటే తెలంగాణ ఇచ్చేలా లేదని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పెద్ద పార్టీ అన్నారు. ఎక్కడైనా పెద్ద పార్టీ వెళ్లి చిన్న పార్టీలో కలుస్తుందా అని ప్రశ్నించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వీలినంపై తమకు సంబంధం లేదని చెప్పారు. విలీనంతో బిజెపికి సంబంధం లేదన్నారు. కానీ తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని చెప్పారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం బిజెపి తెలంగాణకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తానని చెబుతుంటే కాంగ్రెసు పార్టీ నాన్చుడూ ధోరణి ప్రదర్శిస్తోందన్నారు.

English summary
TRS president K Chandrasekhar Rao condemned today that TRS merger with Congress comments. TRSLP Etela Rajender, MP Vijayashanthi, MLA Harish Rao also condemned that comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X