వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అద్వానీ నన్ను క్షమించరు: ధ్వజమెత్తిన ప్రధాని మన్మోహన్ సింగ్

ప్రధాని పదవి తన జన్మహక్కు అని అద్వానీ అనుకుంటున్నారని, అందువల్ల తనను అద్వానీ క్షమించబోరని ఆయన బుధవారం అన్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, మరో మూడున్నరేళ్లు నిరీక్షించాలని ఆయన అన్నారు. వక్తగా తాను సుష్మా స్వరాజ్‌కి దీటు కాలేనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. విదేశీయులు ఏదో చెప్తే అది వాస్తవం కాదని తాము తేల్చలేమని ఆయన అన్నారు. వికీలీక్స్ వెల్లడించిన అంశాల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటరీ విచారణ సంఘం కూడా ఆరోపణల్లో నిజం లేదని తేల్చిందని ఆయన చెప్పారు. తాము అక్రమాలకు పాల్పడలేదని, డబ్బులు ఇవ్వాలని తాము ఎవరికీ చెప్పలేదని ఆయన అన్నారు.