హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒట్లున్న భార్యలను వదిలేసి భర్తలతో క్యాంప్ పెడితే ఎలా: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: స్థానిక శాసనమండలి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మూడు సీట్లే గెలుచుకోవడంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయా జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమై ఓటింగ్ ఉన్న భార్యలను వదిలేసి భర్తలతో క్యాంపులు నిర్వహిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అన్నట్టుగా తెలుస్తోంది. కాగా ఎన్నికలపై ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా బుధవారం మాట్లాడారు. కాంగ్రెసు పార్టీని ఎవరూ ఓడించలేరని అన్నారు. ఎన్నికలు ప్రత్యేక పరిస్థితులలో జరిగినందున నష్టపోయామన్నారు.

అయితే పార్టీలోని అంతర్గత విభేదాల వల్ల ఇతరులు లబ్ధి పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని ఓడించాడనే ఆరోపణలపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఆరు సీట్లు గెలుస్తామని అనుకుంటే మూడు సీట్లు మాత్రమే గెలుపొందామని చెప్పారు. అయితే కొన్ని సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోవడం బాధగా అనిపించిందన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందన్నారు.

ఈ ఎన్నికల ద్వారా కడప జిల్లాలో మేము ఎంత బలంగా ఉన్నామో తెలుస్తోందన్నారు. ఫలితాలు వచ్చే ఎన్నికలకు రిఫరెండం కాదన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉందన్నారు. అప్పటి వరకు ఏమైనా జరగవచ్చన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డ అభ్యర్థులకు టిక్కెట్ ఉండదన్నారు. చిత్తూరు జిల్లాలో ఓటమి వ్యక్తిగతంగా నష్టమే అన్నారు. అయితే దానికి ఎవరినీ బాధ్యులను చేయడం లేదన్నారు. ఎన్నికలలో ఓపెన్ బ్యాలెట్ ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

English summary
CM Kiran Kumar Reddy questioned congress leaders on camp politics with husbands. He said high command will take action on JC. He said election show congress party strength in Kadapa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X